Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్ పై ఉగ్రదాడి... క్వెట్టాలో పేలిన బాంబులు, పలువురి దుర్మరణం

కొద్ది సేపటి క్రితం పాకిస్థాన్ ప్రధాన పట్టణాల్లో ఒకటైన క్వెట్టాపై ఉగ్రవాదుల దాడి జరిగింది. జనసమ్మర్ధమున్న ప్రాంతంలో శక్తిమంతమైన బాంబులను ఉగ్రవాదులు పేల్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ దాడిలో 10 మంది వరకూ చనిపోగా, సుమారు 20 మంది వరకూ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు చేర్చినట్టు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారి ఒకరు వెల్లడించారు. ఈ దాడి వెనుక ఎవరున్నారన్న సమాచారం, మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News